కుర్చీతో సహా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన సిపిఐ నారాయణ...
సిద్దిపేట: హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్ లో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులు పరిహారం డిమాండ్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం వివాదాస్పదంగా మారింది.
సిద్దిపేట: హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్ లో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులు పరిహారం డిమాండ్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే బిజెపి లాఠీ చార్జ్ ఘటనను నిరసిస్తూ ఆందోళనకు దిగింది. తాజాగా సిపిఐ కూడా గౌరవెల్లి నిర్వాసితులకు అండగా నిలిచింది. నిర్వాసితులపై జరిగిన లాఠీ చార్జ్ ను నిరసిస్తూ గౌరవెల్లి రిజర్వాయర్ పై కుర్చీతో సహా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు సిపిఐ నారాయణ.