జగిత్యాలలో ఘోరం... దంపతులపై నడిరోడ్డుపైనే దాడికి యత్నం, చివరకు పోలీస్ స్టేషన్లో...
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవిందుపల్లె వద్ద పట్టపగలు నడిరోడ్డుపైనే ఓ వ్యక్తి భార్యాపిల్లలతో కారులో వెళుతుండగా ఇద్దరు దుండగులు దాడికి తెగబడ్డారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవిందుపల్లె వద్ద పట్టపగలు నడిరోడ్డుపైనే ఓ వ్యక్తి భార్యాపిల్లలతో కారులో వెళుతుండగా ఇద్దరు దుండగులు దాడికి తెగబడ్డారు. కారును ధ్వంసం చేయడంతో పాటు లోపలున్న వారిపై దాడికి ప్రయత్నించారు. భయపడిపోయిన దంపతులు ఎలాగోలా దుండగుల నుండి తప్పించుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడికి చేరుకున్న దుండగులు పోలీసుల ఎదుటే దాడికి దిగారు. భూపంచాయితీ నేపథ్యంలోనే ఆ దాడి జరిగినట్లు సమాచారం.