సమర్థవంతంగా కరోనా వ్యాక్సినేషన్... అరుదైన ఘనత సాధించిన కరీంనగర్ జిల్లా
కరీంనగర్: కరోనా నియంత్రణ విషయంలో కరీంనగర్ జిల్లా అరుదైన ఘనత సాధించింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కరీంనగర్ జిల్లా వైద్య సిబ్బంది అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. దీంతో తెలంగాణలో కొవిడ్ వాక్సినేషన్ రెండవ డోస్ లో 100 % పూర్తి చేసిన ఏకైక జిల్లాగా, దక్షిణ భారత రెండవ జిల్లాగా కరీంనగర్ నిలిచింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని కేక్ కట్ చేసారు. ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, అధికారులు నిరంతరంగా చేసిన కృషితోనే ఇది సాధ్యం అయిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రజల ఆరోగ్యం కోసం మనం చేసిన కృషి ఫలించిందని మంత్రి గంగుల పేర్కొన్నారు.