కరీంనగర్ లో వింత దొంగ... బేకరీలోకి చొరబడి దొంగిలించిందేంటో తెలుసా..? (సిసి వీడియో)
కరీంనగర్ లో వింత దొంగతనం చోటుచేసుకుంది. పట్టణంలోని ముకరంపురలో ఓ బేకరి లో గురువారం అర్థరాత్రి దొంగతనం జరిగింది.
కరీంనగర్ లో వింత దొంగతనం చోటుచేసుకుంది. పట్టణంలోని ముకరంపురలో ఓ బేకరి లో గురువారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. బేకరీ షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగ కౌంటర్లోని రెండు వేలు తీసుకున్నాడు. అనంతరం అక్కడే తచ్చాడుతూ ప్రిజ్ లోని కూల్ డ్రింక్స్ కూడా తీసుకుని అక్కడినుండి వెళ్లిపోయాడు. ఈ దొంగతనం దృశ్యాలు బేకరీలోని సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉదయం బేకరీ షట్టర్ తాళాలు పగిలివుండటం చూసి దొంగతనం జరిగినట్లు గుర్తించిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బేకరీని పరిశీలించి సిసి కెమెరా రికార్డ్ ను పరిశీలించగా దొంగతనం దృశ్యాలు లభించాయి. దీని ఆదారంగా దొంగను గుర్తించేపనిలో పడ్డారు పోలీసులు.