Asianet News TeluguAsianet News Telugu

మన ఊరు-మనబడి పథకం కింద కట్టిన ప్రభుత్వ పాఠశాలకి తాళం వేసిన కాంట్రాక్టర్...

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చింతకుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఓ కాంట్రాక్టర్ తాళం వేశాడు. 

First Published Sep 7, 2022, 9:37 AM IST | Last Updated Sep 7, 2022, 9:37 AM IST

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చింతకుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఓ కాంట్రాక్టర్ తాళం వేశాడు. మన ఊరు-మనబడి పథకం కింద పాఠశాల అభివృద్ధికి వెచ్చించిన 4 లక్షల 50వేల రూపాయల నిధులు తనకు రావడంలేదని శ్రీకాంత్ అనే కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేసినట్టు సమాచారం. తనుపెట్టిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే స్కూల్ ప్రారంభమైన వెంటనే తాళం వేయడంతో విద్యార్థులు ఆరుబయట చెట్ల కింద కూర్చున్నారు. దీంతో ఉపాధ్యాయులు ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వడంతో కరీంనగర్ డిఈవో జనార్దన్ రావు ఆదేశాలతో తమ విధులకు ఆటంకం కలిగాయని సదరు కాంట్రాక్టర్ పై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.