Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ సీనియర్లు దూరమైనా ... హైదరాబాద్ లో శశిథరూర్ కు ఘనస్వాగతం

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న శశిథరూర్ ఇవాళ(సోమవారం) తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు.

First Published Oct 3, 2022, 5:08 PM IST | Last Updated Oct 3, 2022, 5:08 PM IST

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న శశిథరూర్ ఇవాళ(సోమవారం) తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్ కు విచ్చేయగా విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ వ్యక్తిగత కారణాలతో శశిథరూర్ కు పర్యటనకు దూరంగా వుండగా మిగతా సీనియర్లు కూడా థరూర్ ను కలిసేందుకు ఇష్టపడటం లేదు. కానీ ద్వితీయశ్రేణి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శశిథరూర్ కు స్వాగతం పలికారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి రేస్‌లో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ నిలిచిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నిక పోలింగ్ జరగనుంది. అయితే అదిష్టానం ఆశిస్సులు మెండుగా కలిగిన ఖర్గేకే కాంగ్రెస్ శ్రేణులు మద్దతుగా నిలిచారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శశి థరూర్ హైదరాబాద్ పర్యటన ఆసక్తి రేపుతోంది.