Asianet News TeluguAsianet News Telugu

రైతాంగం కోసం కాంగ్రెస్ పార్టీ పోరుబాట... హుస్నాబాద్ లో పొన్నం నేతృత్వంలో ఆందోళన

కరీంనగర్ : తెలంగాణ రైతాంగ సమస్యలకోసం ఇవాళ(బుధవారం) కాంగ్రెస్ పార్టీ 'పోరుబాట' పేరిట నిరసనలకు పిలుపునిచ్చింది.

First Published Nov 30, 2022, 1:52 PM IST | Last Updated Nov 30, 2022, 1:52 PM IST

కరీంనగర్ : తెలంగాణ రైతాంగ సమస్యలకోసం ఇవాళ(బుధవారం) కాంగ్రెస్ పార్టీ 'పోరుబాట' పేరిట నిరసనలకు పిలుపునిచ్చింది. టిపిసిసి పిలుపుమేరకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్డిఓ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లిన పొన్నం రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం భూసమస్యల పరిష్కారం కోసమంటూ తీసుకువచ్చిన 'ధరణి పోర్టల్' తో రైతులకు సమస్యలు మరింత పెరిగాయని... వెంటనే దీన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసారు. అలాగే గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రుణమాఫీ చేయాలని... అదికూడా ఏకకాలంలోనే చేయాలని కోరారు. ఇక పోడు భూముల సమస్యను పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతూ పొన్న ప్రభాకర్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందించారు.