రాజ్ భవన్ వద్ద రేణుకా చౌదరి హల్ చల్... ఎస్సై చొక్కా పట్టుకుని దురుసు ప్రవర్తన

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ  అధినేత రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతోంది. 

First Published Jun 16, 2022, 2:28 PM IST | Last Updated Jun 16, 2022, 2:28 PM IST

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ  అధినేత రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతోంది. ఈ క్రమంలోనే  ఇవాళ రాష్ట్రాల రాజ్ భవన్ ముట్టడికి పిలుపునివ్వగా తెలంగాణలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకులు రాజ్ భవన్ వద్ద ఆందోళనకు దిగడంతో వారిని పోలీసలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ వలయాన్ని చేధించుకుని రాజ్ భవన్ వైపు దూసుకెళ్లేందుకు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులతో ఆమె దురుసుగా ప్రవర్శించారు. తన టచ్ చేయవద్దంటూ పోలీసులను హెచ్చరిస్తూ పంజాగుట్ట ఎస్సై ఖాకీచొక్కా పట్టుకుని లాగారు. దీంతో మహిళా పోలీసులు ఆమెను కంట్రోల్ చేసి వాహనంలో అక్కడినుండి తరలించారు.