సోనియా, రాహుల్ కంటే కవిత గొప్పదా..?: సిబిఐ తీరుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీరియస్

జగిత్యాల : డిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితను విచారించేందుకు సిబిఐ జారీచేసిన నోటీసులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. 

First Published Dec 4, 2022, 12:10 PM IST | Last Updated Dec 4, 2022, 12:10 PM IST

జగిత్యాల : డిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితను విచారించేందుకు సిబిఐ జారీచేసిన నోటీసులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ విచారణ తీరు సరిగ్గా లేదని... కవితను ఇంట్లోనే విచారణ చేపట్టేందుకు అనుమతివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయపార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షులుగా పనిచేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గొప్పదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకే చెందిన ఎల్ రమణ కూడా ఎమ్మెల్సీయే కదా... మరి ఆయనను ఓ విధంగా
కవితను మరో విధంగా విచారించడం ఏమిటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.