Asianet News TeluguAsianet News Telugu

మట్టి, ఇసుక, కంకర... నీ కుటుంబం దేన్ని వదలట్లేదుగా..: పెద్దపల్లి ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు

పెద్దపల్లి : అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబసభ్యులపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సంచలన ఆరోపణలు చేసారు.

First Published Oct 3, 2022, 2:27 PM IST | Last Updated Oct 3, 2022, 2:27 PM IST

పెద్దపల్లి : అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబసభ్యులపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సంచలన ఆరోపణలు చేసారు. పెద్దపల్లిలో జరుగుతున్న అన్ని అవినీతి, అక్రమాలకు కారకులు ఎమ్మెల్యే కుటుంబసభ్యులేనని... ప్రధాన సూత్రదారి మాత్రం మనోహర్ రెడ్డేనని ఆరోపించారు. ఎమ్మెల్యే అక్రమ ఇసుక దందాకు సహకరిస్తే ఆయన తమ్ముడు మట్టి, వియ్యంకుడు కంకర దందా చేస్తున్నారని ఆరోపించారు. మానేరు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముఠాల నుండి ఎమ్మెల్యేకు ముడుపులు అందుతున్నాయని విజయరమణారావు ఆరోపించారు. ఇసుక అక్రమాలు చాలవన్నట్లు ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూముల కబ్జాకు మనోహర్ రెడ్డి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇలా కరీంనగర్ లో ఎకరా ఇరవై గుంటల భూమిని కబ్జా చేసిన ఘనత మనోహర్ రెడ్డిది అని ఆరోపించారు. ఆయన కబ్జా గురించి తెలిసి ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుందని విజయరమణారావు పేర్కొన్నారు.