కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ఒక్క రోజు దీక్ష
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజి ఎంపి వి.హనుమంత రావు అంబర్ పేట లోని తన నివాసంలో ఒక్క రోజు దీక్ష చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజి ఎంపి వి.హనుమంత రావు అంబర్ పేట లోని తన నివాసంలో ఒక్క రోజు దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కండ్లు తెరిపించాలనే ఈ దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేనట్టే వ్యవహరిస్తున్నాడు అంటూ మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు. ప్రతిపక్షాల సలహాలు పనికివచ్చేవి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర బృందం వచ్చినా ప్రతిపక్షాలను ఇన్ వాల్వ్ చేయడం లేదు.. ఓ దిక్కు లాక్ డౌన్ అని మరోదిక్కు టెండర్లు పిలుస్తుండ్రు అన్నారు.