Asianet News TeluguAsianet News Telugu

బిఆర్ఎస్ అంటే భారత రాబరీ పార్టీ..: కొండా సురేఖ సీరియస్

హైదరాబాద్ : డిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ నుండి తప్పించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ  జాగృతిని రంగంలోకి దింపిందని కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ ఆరోపించారు.

First Published Dec 14, 2022, 1:28 PM IST | Last Updated Dec 14, 2022, 1:29 PM IST

హైదరాబాద్ : డిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ నుండి తప్పించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ  జాగృతిని రంగంలోకి దింపిందని కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ ఆరోపించారు. అందుకే తెలంగాణ జాగృతిని కాస్త భారత జాగృతిగా మార్చుతోందని అన్నారు. తెలంగాణ మేధావులు మాట్లాడటం లేదంటున్న కవిత ఓ విషయం తెలుసుకోవాలి... కేసీఆర్ సీఎం అయ్యాకే మేధావులు మాట్లాడటం మానేసారన్నారు. సోనియా గాంధీ తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగాలకు చలించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ కుటుంబం మాత్రమేలాభపడ్డదని సురేఖ అన్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోపిడి దొంగల్లాగా దోచుకుతిన్నారని... ఇప్పుడు ఇక్కడ తినడానికి ఏం లేదు కాబట్టే దేశంమీద పడ్డారన్నారు. బిఆర్ఎస్ అంటే భారత  రాబరీ పార్టీ, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబరీ పార్టీ అని సురేఖ ఎద్దేవా చేసారు.