Asianet News TeluguAsianet News Telugu

ఒక్క అవకాశమివ్వండి... మీ గొంతునై ప్రశ్నిస్తా..: బల్మూరి వెంకట్

కరీంనగర్: రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీకి ఓట్లడిగే హక్కు లేదని... ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే ఈ రెండు పార్టీలు ఓట్లు ఆడగాలని కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి బల్మూరి వెంకట్ డిమాండ్ చేసారు.

Oct 22, 2021, 12:33 PM IST

కరీంనగర్: రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీకి ఓట్లడిగే హక్కు లేదని... ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే ఈ రెండు పార్టీలు ఓట్లు ఆడగాలని కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి బల్మూరి వెంకట్ డిమాండ్ చేసారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఇక్కడి ప్రతీ సమస్యపై అసెంబ్లీలో మీ గొంతునై ప్రశ్నిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే ఓటు వేయాలని వెంకట్ కోరారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఇల్లంతకుంట మండల పరిధిలోని మర్రివానిపల్లి, సీతంపేట ప్రాంతాలలో వెంకట్ ప్రచారం నిర్వహించారు.  ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలని వెంకట్ అభ్యర్ధించారు.