Asianet News TeluguAsianet News Telugu

తెరాస లో భగ్గుమన్న విబేధాలు: బూతులు తిట్టుకుంటూ లీడర్ల బాహాబాహీ

వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ల మధ్య రాజుకున్న విభేదాలు ఒక్కసారి భగ్గుమన్నాయి. 

వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ల మధ్య రాజుకున్న విభేదాలు ఒక్కసారి భగ్గుమన్నాయి. శనివారం వాల్మీకి జయంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పూల మాలలు వేసే క్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొని ఒకరినొకరు తన్నుకున్నారు. చైర్మన్ పూలమాల వేయగానే ప్రోటోకాల్ ప్రకారం వైస్ చైర్మన్ ను పిలవాలని గొడవకు దిగారు. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి అసభ్య పదజాలంతో దూషించుకున్నారు.