జగిత్యాలలో విచిత్రం... హత్య కేసులో కోడిపుంజు అరెస్ట్

జగిత్యాల: ఓ హత్యకు కారణమైన కోడిపుంజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

First Published Feb 26, 2021, 4:48 PM IST | Last Updated Feb 26, 2021, 4:48 PM IST

జగిత్యాల: ఓ హత్యకు కారణమైన కోడిపుంజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి మరణంలో కోడి పాత్ర కూడా ఉండడంతో పోలీసులో కస్టడిలోకి తీసుకున్నారు. మనిషి కోసుకుని తినే కోడిని మనిషిని చంపడమేంటి? పోలీసులు దాన్ని అదుపులోకి తీసుకోవడం ఏంటీ అనుకుంటున్నారా అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే మరీ…జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీసులు ఓ కోడి పుంజును అరెస్ట్ చేశారు. స్టేషన్ లోనే దానికి దాన వేస్తూ కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచారు. గొల్లపల్లి మండలం లొత్తునూర్ గ్రామంలో ఇటీవల కోడి పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు పందెం రాయుళ్లు. పందెం కోసం సిద్ధం చేసిన కోడి పుంజుకు అమర్చిన కత్తి గుచ్చుకోవడంతో వెల్గటూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సత్తయ్య(45)కు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సత్తయ్య హత్య కేసును విచారిస్తున్న క్రమంలో ఇందుకు కారణమైన కోడిపుంజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.