వరంగల్ జైల్లో కేసీఆర్... ఖైదీలతో ఆత్మీయ పలకరింపు

వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ(శుక్రవారం) వరంగల్ లో పర్యటించారు.

First Published May 21, 2021, 6:02 PM IST | Last Updated May 21, 2021, 6:02 PM IST

వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ(శుక్రవారం) వరంగల్ లో పర్యటించారు. మొదట నగరంలోని ఎంజిఎం హాస్పిటల్లోని కరోనా రోగులను పరామర్శించిన సీఎం ఆ తర్వాత సెంట్రల్ జైల్ ను సందర్శించారు. ఈ క్రమంలోనే జైల్లోని ఖైదీలను పరామర్శించిన ఆయన వారు నేరాల వెనుక కారణాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే  జైల్లో వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
 ఖైదీలు తయారు చేసిన పలు రకాల చేనేత  ఉత్పత్తులతో పాటు  స్టీల్ ఉత్పత్తులను పరిశీలించారు సీఎం కెసిఆర్.