Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ సభకే బస్సులన్నీ... జగిత్యాలలో ప్రయాణికుల అవస్థలివీ..!

జగిత్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో ఇవాళ(బుధవారం) జగిత్యాల జిల్లాలో ఆర్టిసి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

First Published Dec 7, 2022, 4:57 PM IST | Last Updated Dec 7, 2022, 4:57 PM IST

జగిత్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో ఇవాళ(బుధవారం) జగిత్యాల జిల్లాలో ఆర్టిసి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జగిత్యాల కలెక్టరేట్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడమే కాదు భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ క్రమంలోనే ఈ సభకు భారీగా జనసమీకరణ చేపట్టడానికి అధికార పార్టీ ఆర్టిసి బస్సులను ఉపయోగిస్తోంది. దీంతో నిత్యం ఆర్టిసి బస్సులపైనే ఆదారపడి ప్రయాణాలు సాగించే సామాన్యులు బస్సుల్లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.