కాశీ విశ్వనాథున్ని దర్శించుకున్న కేసీఆర్ కుటుంబం... ప్రత్యేక పూజలు
ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ, కూతురు కవితతో పాటు మరికొందరు కుటుంబసభ్యులు ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో పర్యటిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ, కూతురు కవితతో పాటు మరికొందరు కుటుంబసభ్యులు ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో పర్యటిస్తున్నారు. నిన్న(గురువారమే) వారణాసికి చేరుకున్న సీఎం కుటుంబం
తెల్లవారుజామున కాశీ విశ్వనాథ ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకున్నారు. అనంతరం అన్నపూర్ణ దేవాలయానికి చేరుకుని ఆచార్య దీపక్ మాల్వియా ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
అలాగే దుందిరాజ్ ఆలయంలో ఆచార్య దీపక్ మాల్వియా, శంకర్ బాబా ఆధ్వర్యంలో ప్రత్యేక 'గణేష్ పూజ' లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. అనంతరం వరాహి దేవాలయాన్ని దర్శించుకుంది సీఎం కుటుంబం.