Asianet News TeluguAsianet News Telugu

రెండు గ్రామాల మత్స్యకారులు మధ్య గొడవ... పోలీసుల లాఠీచార్జి

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో చల్లూరులో చేపలు పట్టే విషయంలో ఇరు గ్రామాల మధ్య ఏర్పడ్డ వివాదం కాస్తా లాఠీ ఛార్జికి దారి తీసింది. 

First Published Apr 3, 2023, 4:02 PM IST | Last Updated Apr 3, 2023, 4:02 PM IST

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో చల్లూరులో చేపలు పట్టే విషయంలో ఇరు గ్రామాల మధ్య ఏర్పడ్డ వివాదం కాస్తా లాఠీ ఛార్జికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలంలోని చల్లూరు, ఇప్పలపల్లి గ్రామలకు చెందిన మత్స్యకారుల మధ్య చేపలు పట్టుకునే విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు గ్రామాల ప్రజల మధ్య మాటలు పెరిగి దాడులు చేసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరుగ్రామాల మత్సకారులను ఆపే ప్రయత్నం చేసినా... వారు వినలేదు.  గొడవ మరింత ఉధృతం అయి ఇరు వర్గాలు ఒకరిమీద ఒకరు దాడికి దిగడంతో... పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.