సెస్ ఎన్నికల ఓట్ల లెక్కింపు... కేటీఆర్ ఇలాకాలో బిజెపి ఆధిక్యం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థుల సమక్షంలో జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఎలక్షన్ అథారిటీ సుమిత్ర బ్యాలెట్ బాక్సుల సీల్ తీసి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు.
అయితే మంత్రి కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో బిజెపి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. సిరిసిల్ల పరిధిలోని చిన్నంపేట గ్రామంలో బిజెపి బలపర్చిన అభ్యర్థి మూర శైలజకు 74 ఓట్లు రాగా టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి దిడ్డి రమాదేవి కి 23 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక సిరిసిల్ల టౌన్ 2 పోస్టల్ బ్యాలెట్స్ లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి లక్ష్మీనారాయణకు 18, బిజెపి బలపర్చిన అభ్యర్థి సుభాష్ రావుకు ఎనిమిది ఓట్లు వచ్చాయి.