Asianet News TeluguAsianet News Telugu

ఎస్సారెస్సి కెనాల్ లోకి దూసుకెళ్లిన కారు... ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామశివారులో ఓ కారు అదుపుతప్పి ఎస్సారెస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లింది. 

First Published Feb 15, 2021, 10:15 AM IST | Last Updated Feb 15, 2021, 10:15 AM IST

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామశివారులో ఓ కారు అదుపుతప్పి ఎస్సారెస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లింది. ఓ కుటుంబం దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయడంతో కారు అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కోరుట్ల మండలం జోగినపల్లి గ్రామానికి చెందిన జగిత్యాల పిపి అమరెందర్ రావు, భార్య శిరీష, కూతురు శ్రీయ   మృతిచెందగా కొడుకు అజయ్ రావు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. కారును బయటకు తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.