Asianet News TeluguAsianet News Telugu

చిన్నారులతో సెల్పీలు దిగుతూ...రామప్ప దేవాలయం వద్ద ఎమ్మెల్సీ కవిత సందడి

ములుగు : యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటుదక్కించుకున్న ప్రాచీన రామప్ప దేవాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు.

First Published Jan 23, 2023, 3:36 PM IST | Last Updated Jan 23, 2023, 3:36 PM IST

ములుగు : యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటుదక్కించుకున్న ప్రాచీన రామప్ప దేవాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఆలయానికి చేరుకున్న కవితకు అర్చకులు, అధికారుల సాదరస్వాగతం పలికారు. రుద్రేశ్వర స్వామిని దర్శించుకున్న కవిత ప్రత్యేక పూజలు చేసారు. 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని చూసి మేధావులు, పలువురు ప్రముఖులు ఆశ్చర్య పోతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాచీన దేవాలయాన్ని తెలుగు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా సందర్శిస్తుంటారని అన్నారు. ఈ అలయానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం తెలంగాణకే గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.