Asianet News TeluguAsianet News Telugu

బిఆర్ఎస్ ఎంట్రీకి వ్యూహాలు... ఏపీ నాయకులతో కేసీఆర్ కీలక భేటీ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ స్థాయిలో రాజకీయాలకు సీఎం కేసీఆర్ సిద్దమయ్యారు. 

First Published Dec 23, 2022, 4:32 PM IST | Last Updated Dec 23, 2022, 4:32 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ స్థాయిలో రాజకీయాలకు సీఎం కేసీఆర్ సిద్దమయ్యారు. ఈ క్రమంలో ఇప్పటికే దేశ రాజధాని న్యూడిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటుచేసిన కేసీఆర్ ఇప్పుడు మెల్లిగా పొరుగురాష్ట్రాల్లో విస్తరణ దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే మరో తెలుగురాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో బిఆర్ఎస్ విస్తరణకు చర్యలు ప్రారంభించిన కేసీఆర్ తాజాగా ఆ రాష్ట్రానికి చెందిన నాయకులతో సమావేశమయ్యారు. ఏపీకి చెందిన పలువురు నాయకులు ప్రగతిభవన్ లో కేసీఆర్ ను కలిసి రాష్ట్రంలో బిఆర్ఎస్ విస్తరణకు గల అవకాశాలపై చర్చించారు. అతిత్వరగా ఏపీలో బిఆర్ఎస్ పార్టీ శాఖల ఏర్పాటుకు సిద్దమైన కేసీఆర్ దీనిపై నేతలతో చర్చించారు.