సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు బాంబ్ బెదిరింపు ... రంగంలోకి డాగ్, బాంబ్ స్క్వాడ్
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాంబు కలకలం రేగింది. స్టేషన్లోని ఓ ప్లాట్ ఫారంపై ప్రయాణికులతో సిద్దంగా బళ్లారి ఎక్స్ ప్రెస్ లో బాంబు వుందంటూ పోలీస్ కంట్రోల్ రూం కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాంబు కలకలం రేగింది. స్టేషన్లోని ఓ ప్లాట్ ఫారంపై ప్రయాణికులతో సిద్దంగా బళ్లారి ఎక్స్ ప్రెస్ లో బాంబు వుందంటూ పోలీస్ కంట్రోల్ రూం కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసారు. దీంతో పోలీసులు రైల్వే రక్షణ దళం, జిఆర్పి పోలీసులను అప్రమత్తం చేయగా... వారు రైల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అలాగే డాగ్, బాంబ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగి బళ్ళారి ఎక్స్ ప్రెస్ లో బాంబ్ కోసం వెతికారు. ఈ తనిఖీలతో అసలు ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు ఆందోళన చెందారు. బళ్లారి ఎక్స్ ప్రెస్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం బాంబు లేదని నిర్దారణకు వచ్చారు. దీంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ బాంబ్ బెదిరింపుతో బళ్లా ఎక్స్ ప్రెస్ కాస్త ఆలస్యంగా బయలుదేరింది.