Asianet News TeluguAsianet News Telugu

చరిత్రలోనే ఎప్పుడూ ఇలా జరగలేదు ... సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల, రఘునందన్ ఫైర్

బీఏసీ సమావేశానికి తమ పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ పిలవలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

First Published Sep 6, 2022, 1:55 PM IST | Last Updated Sep 6, 2022, 1:55 PM IST

బీఏసీ సమావేశానికి తమ పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ పిలవలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. బీజేపీ నుంచి రాజాసింగ్ ఒక్కరున్నప్పుడు  బీఏసీ సమావేశానికి పిలిచారని.. ఇప్పుడు ముగ్గురు సభ్యులున్నప్పుడు ఎందుకు పిలవడంలేదని ప్రశ్నించారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ సమావేశానికి పిలుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కో రోజు మాట్లాడి సమావేశాలను ముగించాలని అనకుంటున్నారని విమర్శించారు. సీఎం చెప్పినట్లుగా స్పీకర్ నడుచుకుంటున్నారని ఆరోపించారు.  మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడిగా నడిపిస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ సభ సంప్రదాయాలను గౌరవించాలని కోరారు. సీఎం చెప్పినట్టుగా వినకుండా సభ్యుల హక్కులను కాపాడాలని అన్నారు. బీఏసీ సమావేశానికి పిలవకపోవడం సభ సంప్రదాయాలను విస్మరించడమేనని చెప్పారు. 3 రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహణ సరికాదని అన్నారు. బీజేపీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుందని చెప్పారు.