అసెంబ్లీ ప్రాంగణంలో కూడా వుండనివ్వకుండా... పోలీస్ వాహనంలో బలవంతంగా ఈటల తరలింపు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసెంబ్లీ సమావేశాల నుండి సస్పెన్షన్ కు గురయ్యారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసెంబ్లీ సమావేశాల నుండి సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ సెషన్స్ మొత్తానికి ఈటలను సస్పెండ్ చేయడమే కాదు అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ఆయనను వుండనివ్వలేదు. సస్పెన్షన్ అనంతరం ఈటలను పోలీసులు బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని అసెంబ్లీ బయటకు తీసుకువెళ్లారు. తనపై కేసీఆర్ సర్కార్, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఈటల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికార పార్టీకి, సీఎం కేసీఆర్ కు బానిసల్లా వ్యవహరించవద్దని పోలీసులను హెచ్చరించారు. తెలంగాణ అసెంబ్లీలో తన ముఖం చూడకూడదనే సీఎం కేసీఆర్ సంవత్సర కాలంగా కుట్రలు చేస్తున్నారని... గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరుకాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ను గద్దె దించేవరకు విశ్రమించబోనని సవాల్ చేసారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బయపడబోనని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.