బ్లాక్ మెయిలర్ రేవంత్ వి చిల్లర మాటలు...ఆయన నైజమదే: ఈటల రాజేందర్ ధ్వజం
హైదరాబాద్ : తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు అభివృద్దికి నోచుకోవడం లేదని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ : తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు అభివృద్దికి నోచుకోవడం లేదని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇలా మునుగోడులో కూడా ఈ మూడేళ్లలో ఎలాంటి అభివృద్ది జరక్కపోవడంతో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్దపడ్డారని తెలిపారు. ఈ ఉపఎన్నికల కోసమైనా మునుగోడు అభివృద్దిపై కేసీఆర్ సర్కార్ దృష్టి పెడుతుందని భావించే కోమటిరెడ్డి రాజీనామా చేసివుంటారని ఈటల పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన హోదాను మరిచి చిల్లర కామెంట్స్ చేస్తున్నాడని ఈటల అన్నారు. నిన్న రేవంత్ మాట్లాడిన మాటలు సమాజం అసహ్యించుకునే రీతిలో జుగుప్చాకరంగా ఉన్నాయన్నారు. తిట్టడం, బ్లాక్ మెయిల్, ఇతరుల మనసులు గాయపరచడం రేవంత్ నైజమని... పిసిసి అధ్యక్ష స్థాయిలో వుండికూడా గత భాష, ప్రవర్తన, బ్లాక్ మెయిల్ మర్చిపోలేదన్నారు. నాలుగు పార్టీలు మారిన నాయకుడి గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి తాను మాట్లాడలేనని... కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక బాగుపడదనే నిస్ఫృహతోనే రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఈటల అన్నారు.