ఉత్తరద్వార దర్శనం... ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామికి ఎమ్మెల్యే ఈటల ప్రత్యేక పూజలు
కరీంనగర్: పవిత్రమైన వైంకుఠ ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వారం నుండి వెళ్లి దర్శించుకుంటే సకల పాపాలు హరింపబడి మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే తిరుపతి సహా చాలా దేవాలయాల్లో ఈరోజున ఉత్తరద్వార దర్శనం కల్పిస్తుంటారు. ఇలా హుజురాబాద్ నియోజవర్గం ఇల్లంతకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కూడా ఉత్తర ద్వారా దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.