పాతబస్తీలో బిజెపి మీటింగ్... అడ్డుకున్న ఎంఐఎం కార్పోరేటర్ పై కేసు

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

First Published Feb 17, 2023, 1:45 PM IST | Last Updated Feb 17, 2023, 1:45 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా బిజెపి కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తుండగా పాతబస్తీలో కూడా ఈ సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లుచేసింది. మోచీ కాలనీ తాడ్ బన్ లో జరగాల్సిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ను ఎంఐఎం కార్పోరేటర్ మహ్మద్ ఖాదర్ అనుచరులతో కలిసి అడ్డుకున్నాడు. దీంతో బిజెపి నాయకులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి మీటింగ్ ను అడ్డుకుని తమపై దాడికి పాల్పడిన ఎంఐఎం కార్పోరేటర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ పాతబస్తీలో ధర్నా చేపట్టారు. దీంతో ఎలాంటి ఉద్రక్తత చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. బిజెపి నేతల ఆందోళనతో కాలాపత్తర్ పోలీసులు ఎంఐఎం కార్పోరేటర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.