Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో ఉద్రిక్తత... నిరుద్యోగుల కోసం బిజెవైఎం, ఉద్యోగుల కోసం బిజెపి నిరసనలు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ, టీచర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాజధాని హైదరాబాద్ లో బిజెపి ఆందోళనకు దిగింది.

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ, టీచర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాజధాని హైదరాబాద్ లో బిజెపి ఆందోళనకు దిగింది. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు పగతి భవన్ ముట్టడికి యత్నించగా చిన్నారులతో సహా టీచర్లను పోలీసులు అరెస్ట్ చేసారు. ఇలా టీచర్ల పట్ల అమానుషంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ  బిజెపి మైనార్టీ మోర్చా నేతలు ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. దీంతో మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అప్సర్ పాషా, ఇతర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇక తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో లక్షలాది మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు, బిజెవైఎం నాయకులు నాంపల్లిలోని తెలంగాణ డిజిపి కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో భారీగా మొహరించిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.