Huzurabad Bypoll:ఈటలకు షాక్... మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ భారీ చేరికలు
కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన తర్వాత హుజురాబాద్ రాజకీయాలు రసవత్తంగా మారాయి. ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా రంగంలోకి దిగిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు పార్టీలోకి భారీగా చేరికలను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు టిఆర్ఎస్ లో చేరారు. స్థానిక బిజెపి నాయకుడు శ్రీకాంత్ తో పాటు ఇతర నాయకులను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కండువా కప్పి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.