సంజయన్నకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామంటూ... కరీంనగర్ లో బిజెపి శ్రేణుల ఆందోళన
కరీంనగర్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్, పాదయాత్రకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో ఆ పార్టీశ్రేణులు ఆందోళన చేపట్టారు.
కరీంనగర్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్, పాదయాత్రకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో ఆ పార్టీశ్రేణులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు నల్ల కండువాలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంజయన్నకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామంటూ నినదించారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసారు.