రామగుండం ఎన్టిపిసి కార్మికులపై కేంద్ర బలగాల లాఠీ చార్జ్... బిజెపి నేత సోమారపు సీరియస్

పెద్దపల్లి : తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న రామగుండం ఎన్టిపిసి కాంట్రాక్ట్ కార్మికులపై సిఐఎస్ఎఫ్ (Central Industrial Security Force) దాడిని బిజెపి నాయకులు సోమారపు సత్యనారాయణ ఖండించారు. 

First Published Sep 1, 2022, 4:02 PM IST | Last Updated Sep 1, 2022, 4:02 PM IST

పెద్దపల్లి : తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న రామగుండం ఎన్టిపిసి కాంట్రాక్ట్ కార్మికులపై సిఐఎస్ఎఫ్ (Central Industrial Security Force) దాడిని బిజెపి నాయకులు సోమారపు సత్యనారాయణ ఖండించారు. తమపై లాఠీచార్జ్ చేయించిన ఎన్టిపిసి యాజమాన్యం తీరుకు నిరసనగా లేబర్ గేట్ వద్ద కార్మికులు చేపట్టిన 48గంటల ధర్నాకు సోమారపు మద్దతిచ్చారు. కార్మికులపై కుట్రపూరిత దాడికి ఎన్టిపిసి ఏజిఎం బాధ్యత వహించాలని... లాఠీచార్జ్ కు పాల్పడిన సిఐఎస్ఎఫ్ సిబ్బందిని అరెస్ట్ చేయాలని బిజెపి నేత సోమారపు డిమాండ్ చేసారు.  బిజెపి కార్మికసంఘం నేత కౌశిక్ హరి కూడా ఎన్టిపిసి కార్మికులకు మద్దతు తెలిపారు.