Asianet News TeluguAsianet News Telugu

బిజెపిలో చేరడానికి ప్రధాన కారణమదే..: మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి

కరీంనగర్ : తెలంగాణ ఫస్ట్ అనే స్లోగన్ తో తాను బిజెపిలో చేరినట్లు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.

First Published Dec 11, 2022, 1:07 PM IST | Last Updated Dec 11, 2022, 1:07 PM IST

కరీంనగర్ : తెలంగాణ ఫస్ట్ అనే స్లోగన్ తో తాను బిజెపిలో చేరినట్లు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తో పాటు ఆయన కొడుకు, కూతురు, అల్లుడే ఫస్ట్ అని... ఓవరాల్ గా కల్వకుంట్ల ఫ్యామిలీనే ఆ పార్టీలో ఫస్ట్ అంటూ ఎద్దేవా చేసారు. ఈ కుటుంబ పరిపాలన అంతమొందించాలంటే తెలంగాణ ప్రజలంతా ఏకమై సరైన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి పేర్కొన్నారు. 

కరీంనగర్ పట్టణంలోని టవర్ సర్కిల్ లో బిజెపి నిర్వహించనున్న బహిరంగ సభ ప్రచార కార్యక్రమంలో మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ డిసెంబర్ 15న జరగనుందని... జాతీయాధ్యక్షులు జెపి నడ్డా పాల్గొనే ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలను మోసం చేస్తూ గత ఎనిమిదేళ్లుగా సాగుతున్న దుష్ట, అవినీతి పరిపాలనను అంతమొందించడం బిజెపితోనే సాధ్యమని... అందుకోసం ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపైనా వుందని మాజీ మంత్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.