సిగ్గూ శరం వుండాలి... పింక్ డ్రెస్సులతో డ్యూటీ చేయండి..: పోలీసులపై మాజీ ఎమ్మెల్యే చింతల సీరియస్
డిల్లీ లిక్కర్ స్కాంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవితకు సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఇంటిని బిజెపి నాయకులు ముట్టడించే ప్రయత్నం చేసారు.
డిల్లీ లిక్కర్ స్కాంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవితకు సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఇంటిని బిజెపి నాయకులు ముట్టడించే ప్రయత్నం చేసారు. ఇలా బంజారాహిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత ఇంటివద్దకు చేరుకున్న బిజెపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసారు. కవిత ఇంటి ముట్టడికి యత్నించిన బిజెపి నాయకులను టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగినట్లు సమాచారం. ఇలా గాయపడిన బిజెపి నాయకులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరామర్శించారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యాక్షులు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులు సిగ్గూ, శరం లేకుండా వ్యవహరిస్తున్నారని.... అంతలా టీఆర్ఎస్ కు ఊడిగం చేయాలంటే పింక్ డ్రెస్ వేసుకోవాలని రామచంద్రారెడ్డి పోలీస్ ఉన్నతాధికారి ముందే విరుచుకుపడ్డారు.
Delhi Liquor Scam, BJP, chintala rama