కొడవలి చేతబట్టి వరికోత... రైతుకూలీ అవతారమెత్తిన బిజెపి మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్ : రైతాంగానికి అండగా ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని అంకితం చేస్తే మరోవైపు బిజెపి మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ రైతుకూలీ అవతారమెత్తారు.

First Published Nov 13, 2022, 1:09 PM IST | Last Updated Nov 13, 2022, 1:09 PM IST

హైదరాబాద్ : రైతాంగానికి అండగా ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని అంకితం చేస్తే మరోవైపు బిజెపి మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ రైతుకూలీ అవతారమెత్తారు. రైతులు, కూలీల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు స్వయంగా వరిపొలంలో అడుగుపెట్టి కొడవలితో కోత ప్రారంభించారు ఎమ్మెల్యే ప్రభాకర్. కేవలం ఫోటోలకు పోజులివ్వకుండా కొద్దిసేపు అలాగే వరికోత జరిపి ఆ కూలీల కష్టమేంటో అనుభవించారు ఎమ్మెల్యే. దేశప్రజలందరి ఆకలి తీర్చే అన్నదాతకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ అండగా నిలిచారని ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. పంటలకు మద్దతు ధర కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిందన్నారు. పెట్టుబడి కోసం పీఎం కిసాన్, యూరియా, డిఎపి పై సబ్సిడి కల్పించి దేశ రైతాంగాన్ని ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే ప్రభాకర్ పేర్కొన్నారు.