తెలంగాణ వ్యవసాయ శాఖను అభినందించిన బీహార్ మంత్రి (వీడియో)
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం దాని అనుబంద రంగాలలో సాదించిన పురోగతి, రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను బీహర్ వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ ప్రేమ్ కుమార్ ప్రశంసించారు. రాష్ట్రంలో పశుసంవర్థక శాఖ, చేపల పెంపకం లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయన తెలుసుకొన్నారు.

నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణ లో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులు, మౌలిక సదుపాయాల గురించి అద్యయనం చేసి బీహార్ కృషి రోడ్ మ్యాప్ తయారు చేయడానికి ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందాన్ని తెలంగాణకు పంపారు.
ఇందులో భాగంగా బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి డా. ప్రేమ్ కుమార్, వ్యవసాయ అనుబంద శాఖల అదీకారులతో కలిసి హైదరాబాద్ వచ్చారు.మూడు రోజుల పాటు తెలంగాణాలో తెలంగాణ విత్తన పరిశ్రమలను, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లను, విత్తనోత్పత్తి క్షేత్రాలను, విత్తన పరీక్ష ల్యాబ్ లను కూడ సందర్శించనున్నారు.