Bhoiguda Fire Accident:ప్రత్యేక విమానంలో బిహార్ కు మృతదేహాల తరలింపు: మంత్రి తలసాని
హైదరాబాద్: బోయిగూడ్ టింబర్ డిపో అగ్నిప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలను ప్రత్యేక విమానంలో బిహార్ కు తరలించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. అగ్నిప్రమాదం జరిగిన బోయిగూడ టింబర్ డిపోను మంత్రితో పాటు సీఎస్ సోమేష్ కుమార్ పరిశీలించారు. అక్కడినుండి వీరిద్దరు నేరుగా గాంధీ హాస్పిటల్ కు చేరుకుని మార్చులోని మృతదేహాలను పరిశీలించారు. ఈ సమయంలో అక్కడే వున్న మృతుల బంధువులకు ధైర్యం చెప్పారు. మృతదేహాలను బిహార్ కు తరలించే బాధ్యతను ప్రభుత్వానిదేనని... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే అధికారులు ఇందుకు ఏర్పాట్లు చేసారన్నారు. ఈరోజు 6 మృతదేహాలు, రేపు(గురువారం) మరో 5 మృతదేహాల తరలింపుకు ఏర్పాట్లు జరిగినట్లు మంత్రి తలసాని తెలిపారు.