bharathbandh:ఉద్రిక్తత... మంత్రి కొప్పులను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు

కరీంనగర్: రైతు చట్టాలకి వ్యతిరేకంగా దేశంలోని రైతు సంఘాలన్నీ ఇవాళ(మంగళవారం) భారత్ బంద్ కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

First Published Dec 8, 2020, 1:09 PM IST | Last Updated Dec 8, 2020, 1:09 PM IST

కరీంనగర్: రైతు చట్టాలకి వ్యతిరేకంగా దేశంలోని రైతు సంఘాలన్నీ ఇవాళ(మంగళవారం) భారత్ బంద్ కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా బంద్ లో పాల్గొని రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకి నిరసనకు దిగిన సమయంలోనే అల్గునూర్ వద్ద టిఆర్ఎస్ ధర్నాకి వెళ్తున్న మంత్రి కొప్పుల వాహనం అటు వైపుగా వచ్చింది. దీంతో కొప్పుల ఈశ్వర్ వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. చివరికి పోలిసులు జోక్యం చేసుకొని మంత్రి కాన్వాయ్ ని పంపించాల్సి వచ్చింది.