రాహుల్ పాదయాత్ర... మాస్ స్టెప్పులతో అదరగొట్టిన దామోదర రాజనర్సింహ, వీహెచ్
హైదరాబాద్ : భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర తెలంగాణలో విజయవంతంగా కొనసాగుతోంది.
హైదరాబాద్ : భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర తెలంగాణలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పాదయాత్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో మరింత జోష్ పెంచిందనడానికి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ వి. హన్మంతరావు చేసిన మాస్ డ్యాన్సే నిదర్శనం. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర కొనసాగుతున్న సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన సభలో అభిమానుల కోరిక మేరకు దామోదర, విహెచ్ వేదికపైనే స్టెప్పులేసారు. వీరి మాస్ స్టెప్పులతో సభాప్రాంగణమంతా కేరింతలతో నిండిపోయింది.