Asianet News TeluguAsianet News Telugu

సామాన్యురాలి చెప్పులు చేతులతో అందించి ... గొప్పమనసు చాటుకున్న రాహుల్ గాంధీ

హైదరాబాద్ : కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ మానవత్వాన్ని చాటుకున్నారు.

First Published Nov 2, 2022, 3:47 PM IST | Last Updated Nov 2, 2022, 3:47 PM IST

హైదరాబాద్ : కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ మానవత్వాన్ని చాటుకున్నారు. తన సెక్యూరిటీని సైతం పక్కనబెట్టి తోపులాటలో చిక్కుకున్న ఓ మహిళను కాపాడేందుకు ప్రయత్నించారు.  అభిమాన నాయకున్ని కలిసేందుకు వచ్చి గాయపడిన తనకు స్వయంగా సేవచేసి మంచమనసు చాటుకున్న రాహుల్ కు సదరు మహిళ చేతులెత్తి మొక్కింది. వివరాల్లోకి వెళితే... భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కూకట్ పల్లికి రాహుల్ యాత్ర చేరుకోగా భారీగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనను కలిసేందుకు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగి ఓ మహిళ కిదపడిపోయారు. ఇది గమనించిన రాహుల్  వెంటనే మహిళ వద్దకు వెళ్లి చేయి పట్టి పైకిలేపి నీళ్లు అందించారు. దగ్గరకి తీసుకుని మహిళకు రాహుల్ సపర్యలు చేయడమే కాదు ఆమె చెప్పులను తన చేతితో అందించారు. ఇలా ఓ సామాన్యురాలి రాహుల్ సేవలు చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.