Asianet News TeluguAsianet News Telugu

జర్మనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు... ఖండాంతరాలు దాటిన తెలంగాణ పూలపండగ

మ్యూనిచ్ :పూలపండగ బతుకమ్మ సంబరాలు కేవలం తెలంగాణలోనే కాదు దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుగుతున్నాయి.

First Published Oct 2, 2022, 12:16 PM IST | Last Updated Oct 2, 2022, 12:16 PM IST

మ్యూనిచ్ :పూలపండగ బతుకమ్మ సంబరాలు కేవలం తెలంగాణలోనే కాదు దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుగుతున్నాయి. ఖండాంతరాలు దాటినా తెలంగాణ ఆడపడుచులు తమ మూలాలను మరిచిపోకుండా విదేశీ గడ్డలపైనా బతుకమ్మ పండగ జరుపుకుంటున్నారు. ఇలా జర్మనిలో స్థిరపడిన తెలుగువారు మ్యూనిచ్ నగరంలో బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణలో మాదిరిగా గూనుగుపూలతో కాకున్నా జర్మనీలో దొరికే పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడిచేసారు. పిల్లాపాపలతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న తెలుగువారు ఆనందంగా గడిపారు...