కరీంనగర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు ... నిమజ్జనం కోసం సుందరంగా ముస్తాబైన ఘాట్లు
కరీంనగర్ : తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకల కోసం తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.
కరీంనగర్ : తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకల కోసం తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆడపడుచులు హాయిగా బతుకమ్మ ఆడేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే కరీంనగర్ పట్టణంలో రూ. 2 కోట్ల వ్యయంతో మొత్తం 20 చోట్ల బతుకమ్మ నిమజ్జనం పాయింట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇలా పట్టణంలోని 11 డివిజన్ గౌతమి నగర్ లో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన బతుకమ్మ ఘాట్ ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా తెలంగాణ ఆడపడుచులందరికీ మంత్రి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండగకు ఘనంగా ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆడపడుచులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. నిమజ్జనం పాయింట్లను విద్యుత్ దీపాలతో అందగా ముస్తాబు చేయడమే కాదు ప్రమాదాల నివారణకు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.