చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చిన బషీర్ బాగ్ ఘటన..
సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2000 ఆగస్టు 28వ తేదీన హైదరాబాదులోని బషీర్ బాగ్ చౌరస్తా అట్టుడికింది.
సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2000 ఆగస్టు 28వ తేదీన హైదరాబాదులోని బషీర్ బాగ్ చౌరస్తా అట్టుడికింది. పోలీసు కాల్పులతో దద్ధరిల్లింది. అప్పుడు చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. విద్చుచ్చక్తి రేట్లను విపరీతంగా పెంచడానికి వ్యతిరేకంగా పోరాటం సాగింది. తొమ్మిది వామపక్షాల ఆధ్వర్వంలో దశలవారీగా ఉద్యమం వూపందుకుంది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెసు పార్టీ ఆ ఉద్యమానికి మద్దతు తెలిపింది.