''ఈ కుర్చీపై కూర్చొని ఆ పని చెయ్ కేసీఆర్...'': ఖాళీ కుర్చీతో బండి సంజయ్ మౌన దీక్ష

కరీంనగర్ : తెలంగాణలో పోడు భూముల వివాదాన్ని పరిష్కరించి గిరిజనులకు భూహక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టారు. 

First Published Jul 11, 2022, 2:24 PM IST | Last Updated Jul 11, 2022, 2:24 PM IST

కరీంనగర్ : తెలంగాణలో పోడు భూముల వివాదాన్ని పరిష్కరించి గిరిజనులకు భూహక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టారు. కరీంనగర్ లోని వరలక్ష్మి గార్డెన్ లో నల్ల రిబ్బన్ నోటికి కట్టుకుని సంజయ్ తో పాటు ఇతర బిజెపి నాయకులు దీక్ష చేపట్టారు. ఇటీవల గిరిజన మహిళల పట్ల పోలీసుల దమనకాండపై బిజెపి నాయకులు సీరియస్ అయ్యారు. పోడు భూముల సమస్యను కుర్చీ వేసుకుని కూర్చుని దగ్గరుండి పరిష్కరిస్తారని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తచేసేలా దీక్షా వేధికపై ఓ ఖాళీ కుర్చీని పెట్టారు. ఇదిగో కుర్చీ... కూర్చుని పోడుభూముల సమస్యను పరిష్కరించు కేసీఆర్'' అన్నట్లుగా ముఖ్యమంత్రి పేరు రాసిపెట్టిన కుర్చీని దీక్షా వేదికపై పెట్టారు.