జాకెట్లు చించి, చెప్పరానిచోట తాకుతూ... గౌరవెల్లి నిర్వాసిత మహిళలతో పోలీసుల అసభ్య ప్రవర్తన: బండి సంజయ్


సిద్దిపేట: హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్ లో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడమే కాదు చాలా అసభ్యంగా ప్రవర్తించారని తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు.

First Published Jun 15, 2022, 4:39 PM IST | Last Updated Jun 15, 2022, 4:49 PM IST


సిద్దిపేట: హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్ లో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడమే కాదు చాలా అసభ్యంగా ప్రవర్తించారని తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. గుడాటిపల్లిలో గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులపై లాఠీచార్జ్ జరిగిన సమయంలో మహిళా పోలీసులు లేరని... మగ పోలీసులే మహిళల పట్ల అత్యంత నీచంగా ప్రవర్తించారని అన్నారు.
బాధిత మహిళల జాకెట్లు చించడం, చెప్పరాని చోట చేతులేయడం, కొరకడం, గిచ్చడం చేస్తూ అసభ్యంగా వ్యవరించారన్నారు. ఓ బిటెక్ యువతిని పోలీసులు చెప్పరాని చోట కొట్టడమే కాదు ఎక్కడపడితే అక్కడ  గిచ్చుతూ నానా భూతులు తిట్టారన్నారు. కరెంట్ కట్ చేసి ఈ దాష్టికానికి పాల్పడ్డారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.  

ఇదిలావుంటే తెలంగాణ మానవహక్కుల సంఘానికి బిజెపి లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులపై జరిగిన దాడిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎచ్చార్సీని కోరినట్లు బిజెపి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు తెలిపారు.