Asianet News TeluguAsianet News Telugu

బండి సంజయ్ పాదయాత్ర ముగింపు... కరీంనగర్ లో కాంగ్రెస్, బిజెపి పోటాపోటీ ఆందోళనలు

కరీంనగర్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత మహాసంగ్రామ పాదయాత్ర నేడు సొంత నియోజకవర్గం కరీంనగర్ లో ముగియనుంది.

First Published Dec 15, 2022, 1:17 PM IST | Last Updated Dec 15, 2022, 1:17 PM IST

కరీంనగర్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత మహాసంగ్రామ పాదయాత్ర నేడు సొంత నియోజకవర్గం కరీంనగర్ లో ముగియనుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్, నడ్డాకు స్వాగతం పలుకుతూ కరీంనగర్ లో భారీ ప్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు, ప్లెక్సీలు వెలిసాయి. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ లో బహిరంగ జరగనుండగా ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కేంద్ర, రాష్ట్ర బిజెపి కీలక నాయకులతో పాటు భారీగా కార్యకర్తలు, ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో బిజెపి వారికోసం అన్నిఏర్పాట్లు చేసింది. 

ఇదిలావుంటే ఓవైపు సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఎంపీగా కరీంనగర్ కు సంజయ్ ఏం చేసారో చెప్పాలంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ బిజెపి ప్లెక్సీల వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న బిజెపి మైనారిటీ నేతలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.