బండి సంజయ్ సంగ్రామ యాత్ర
బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రను ప్రారంభించారు. హైదరాబాదులోని పాతబస్తీలో గల భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ఆయన శనివారం తన పాదయాత్రను ప్రారంభించారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద ఆయన ఈ యాత్రను సాగిస్తున్నారు. ఆయన పాదయాత్ర నాలుగు విడతల్లో సాగుతుంది. రోజుకు పది కిలోమీటర్లు ఆయన నడక సాగించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, నిరంకుశ పోకడలను ఎండగట్టే ఉద్దేశంతో ఆయన ఈ పాదయాత్రను తలపెట్టారు. బండి సండయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి పెద్ద యెత్తున్న బిజెపి శ్రేణులు కదిలివచ్చాయి.