తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ అరెస్ట్... మార్గమధ్యలో అడ్డుకున్న బిజెపి శ్రేణులు

కరీంనగర్: డిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని ఆమె ఇంటిని బిజెపి శ్రేణులు ముట్టడించాయి.

First Published Aug 23, 2022, 3:55 PM IST | Last Updated Aug 23, 2022, 3:55 PM IST

కరీంనగర్: డిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని ఆమె ఇంటిని బిజెపి శ్రేణులు ముట్టడించాయి. దీంతో బిజెపి నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడంపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సీరియస్ అయ్యారు. బిజెపి నాయకులపై కేసులను నిరసిస్తూ జనగామలో కొనసాగుతున్న పాదయాత్రా శిబిరంలోనే దీక్షకు దిగారు. అయితే ఇలా దీక్షకు దిగిన సంజయ్ ను ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ కు తరలించారు. ఇలా జనగామ నుండి కరీంనగర్ కు బండి సంజయ్ ను తరలిస్తున్న వాహనాన్ని మార్గమధ్యలో తిమ్మాపూర్ వద్ద బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వారిని పక్కకు తోసేసిన పోలీసులు సంజయ్ ను కరీంనగర్ కు తరలించారు. కరీంనగర్ లోని ఆయన ఇంటివద్ద సంజయ్ ని వదిలిపెట్టారు పోలీసులు.