వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం... పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
హైదరాబాద్ : తెలంగాణలో రాజధాని హైదరాబాద్ లోని అమ్మవార్ల ఆలయాల్లో ఆషాడ మాసం సందడి నెలకొంటుంది.
హైదరాబాద్ : తెలంగాణలో రాజధాని హైదరాబాద్ లోని అమ్మవార్ల ఆలయాల్లో ఆషాడ మాసం సందడి నెలకొంటుంది. ఇవాళ (మంగళవారం) నగరంలో ప్రముఖ దేవాలయం బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సతీసమేతంగా ఆలయానికి విచ్చేసి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులతో పాటు భారీగా భక్తులు ఈ కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.